చలికాలంలో మెంతి ఆకులు చేసే మేలు మరువకండి..!

పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


* చలికాలంలో చెమట పట్టేలా వ్యాయామం చేయాలంటే అందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వ్యాయామం త్వరగా పూర్తి చేయవచ్చు. అలాగే చలికాలంలో బరువు తగ్గాలనుకునే వారు త్వరగా బరువు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

 

* మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.